నారాయణ కళాశాల పై మహిళా కమిషన్ ఆగ్రహం..

బాచుపల్లి నారాయణ కళాశాల యాజమాన్యం పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-10-23 04:39 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి నారాయణ కళాశాల యాజమాన్యం పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సక్రమంగా వసతులు లేవని గత కొన్ని రోజుల క్రితమే విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష (17) మృతి చెందిన విషయం పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న నారాయణ కళాశాలను ఆమె మంగళవారం సందర్శించి నిర్వాహకుల పై మండిపడ్డారు.

హాస్టల్ లో పిల్లలు లేకపోవడం, హోమ్ సిక్ కు పంపండం పై సీరియస్ అయ్యారు. గతంలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోండి అని యాజమాన్యంకు తాను సూచించినప్పటికి మార్పు రానందు వల్లే అనూష ఆత్మహత్య సంఘటన జరగడం బాధాకరం అని వాపోయారు. ఇక్కడ ఉన్న స్టాప్ ను అందరినీ మార్చండి నేను మళ్ళీ తనిఖీలకు వస్తాను ఏమాత్రం సమస్యలు ఉన్నా ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి ఇన్స్టిట్యూట్ లో తాను తనిఖీ చేస్తానని ప్రతి నిర్వాహకులు సక్రమంగా విద్యా బోధన సాగించాలని, లేనిచో చర్యలు తప్పవని అన్నారు.


Similar News