కుత్బుల్లాపూర్ లో వార్ వన్ సైడ్
సార్వత్రిక ఎన్నికల ప్రచారం 3 రోజులే మిగిలి ఉండడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
దిశ, దుండిగల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం 3 రోజులే మిగిలి ఉండడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సెటిలర్స్, మైనార్టీలు, దళితులు, ముక్యంగా రెడ్డి సామాజికవర్గం కోలన్ కు జై కొడుతుండడంతో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి వార్ వన్ సైడ్ గా మారింది. బౌరంపేటలో నర్సారెడ్డి భూపతి రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన మహిళా సదస్సుకు వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలి రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోస్ పెరిగింది. 127 డివిజన్ లోని ఇందిరానగర్, సౌభాగ్యనగర్, ఆదర్శ్ నగర్, గుడెన్ మెట్, గురుమూర్తి నగర్, పట్వారీ ఎన్క్లేవ్, గిరినగర్, బీజేఆర్ నగర్, రంగారెడ్డి నగర్, చిన్నారెడ్డి నగర్, నెహ్రునగర్, వెంకట్రామి రెడ్డి నగర్ మీదుగా సాగిన రోడ్ షో, గాంధీ నగర్ వద్ద ముగిసింది ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
బాచుపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ కౌసల్య కాలనీ, అంబెడ్కర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, సాయి నగర్ గుండా సాగింది. బైక్ ర్యాలీలో 500 మంది యువకులు పాల్గొనడంతో కాంగ్రెస్ పార్టీలో జోస్ ను నింపింది. కోలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఆదరణను చూస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగుచెందారని ముక్యంగా స్థానిక శాసన సభ్యుని అనుచరులు భూ కబ్జాలతో కోట్లు కొల్లగొట్టి అమాయక ప్రజలను నట్టేట ముంచారని అందులో ఎమ్యెల్యేకి వాటా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దోచుకొని, దాచుకున్న సొమ్మును కక్కిస్తామన్నారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జెట్టా డి సౌజా, ఆర్ లక్ష్మీ, దీపా అనిల్, అచ్చమ్మ, భవాని, రేణుకా, మాధవి, ఫాతిమా, జాస్మిన్, స్వప్న, అమ్మాజీ, నాగలక్ష్మి, సరోజా, కమల్, అశ్విని, హసీనా తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం
కుత్బుల్లాపూర్ నియోజజవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 130 డివిజన్ కృషి కాలనీలో ఐఎన్టీయూసీ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగు చెందారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హన్మంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రమేష్ చింతల, హరివర్ధన్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, కుంజా శ్రీనివాస్, నవీన్ రెడ్డి, తానం శ్రీధర్ రెడ్డి, యాది రెడ్డి, వీరేశ్ గుప్తా, జేమ్స్, కృష్ణమూర్తి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.