గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన గురువారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2023-04-20 16:24 GMT

దిశ, శామీర్ పేట: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన గురువారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం శామీర్ పేట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో నల్సర్ క్రాస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ వేసుకొని అనుమానస్పదంగా తిరుగుతుండడం గమనించిన పోలీసులు వారిని పట్టుకొని బ్యాగ్ తనిఖీ చేయగా 2.8 కిలోల గంజాయి లభ్యమైంది.

ఆ ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా ఆ ఇద్దరు నిందితులు హరీష్ పరోధి (22), సంజయ్ సాల్వె (23) మహారాష్ట్ర కు చెందిన వారీగా గుర్తించారు. నిందితులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని వారికీ వచ్చే జీతం సరిపోక పోవడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో గంజాయిని కొనుగోలు చేసి మాదాపూర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయించేవారు. హైదరాబాద్ శివారు ప్రాంతం కావడంతో శామీర్ పేటలో విక్రయించేందుకు వచ్చారని తెలిపారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2.8 కిలోల గంజాయిని, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News