రాష్ట్రం వస్తే అంధకారమే అన్నారు.. 24 గంటలు విద్యుత్​ ఇచ్చి చూపించాం: ఎమ్మెల్యే మాధవరం

తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుందన్నారు, విద్యుత్​ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని హేళన చేసిన వారికి ప్రత్యేక రాష్ట్రంలో 24 గంటల విద్యుత్​ సరఫరాను అందించి గట్టి సమాధానం చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్​ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2023-06-06 00:01 GMT

దిశ, కూకట్​పల్లి: తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుందన్నారు, విద్యుత్​ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని హేళన చేసిన వారికి ప్రత్యేక రాష్ట్రంలో 24 గంటల విద్యుత్​ సరఫరాను అందించి గట్టి సమాధానం చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్​ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం ఎన్​కేఎన్​ఆర్​ గార్డెన్స్​లో విద్యుత్​ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్​ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నాయకులు తెలంగాణ వస్తే విద్యుత్​ లేక అంధకారంలో ఉండాల్సిన పరిస్థతి ఉంటుంది, విద్యుత్​ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలంటూ హేళన చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నీళ్లు, నిధులు, నియామకాలు, అభివృద్ధి ఇదే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్​ నాయకత్వంలో సుపరిపాలన కొనసాగిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 24 గంటల విద్యుత్​, వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ అందిస్తూ రాష్ట్రాన్ని అంధకారంలేని రాష్ట్రంగా నిలిపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. 24 గంటల విద్యుత్​ అందించడంతో విద్యుత్​ శాఖ అధికారులు, సిబ్బంది, కార్మికుల సేవలు అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​లు ఆవుల రవీందర్​రెడ్డి, సబీహ బేగం, ముద్దం నర్సింహా యాదవ్​, మందాడి శ్రీనివాస్​ రావు, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News