డ్యూటీకనే వెళ్ళాడు.. ఇంటికి మాత్రం తిరిగి రాలేదు
డ్యూటీకనే వెళ్ళాడు.. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి ఆఫీసుకు ఫోన్ చేసింది.

దిశ, జవహర్ నగర్ : డ్యూటీకనే వెళ్ళాడు.. తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి ఆఫీసుకు ఫోన్ చేసింది. ఇంటికే వెళ్ళాడని వాళ్ళు చెప్పారు.. కానీ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ నగర్ బాలాజీ నగర్ కు చెందిన మంజులాదేవి, సురేష్ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు అందులో మొదటి కుమారుడైన కార్తీక్ (22) ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇప్పటికి తిరిగి ఇంటికి రాలేదు. కార్తీక్ తల్లి మంజులా దేవి ఆఫీస్ కి ఫోన్ చేయగా, కార్తీక్ డ్యూటీ నుంచి వెళ్లిపోయారని సమాచారం అందింది. దీంతో మంజులాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.