తినుబండారాలపై గడువు తేదీ పొడిగించే ముఠా గుట్టురట్టు
చిన్న పిల్లలకు సంబంధించి కాలం చెల్లిన తినుబండారాలు, కాస్మోటిక్ గడువు తేదీ పొడిగించి స్టిక్కరింగ్ చేస్తున్న ముఠా గట్టురట్టు చేసిన ఘటన బోడుప్పల్ పరిధిలోని రెడ్డి కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది.
దిశ, మేడిపల్లి: చిన్న పిల్లలకు సంబంధించి కాలం చెల్లిన తినుబండారాలు, కాస్మోటిక్ గడువు తేదీ పొడిగించి స్టిక్కరింగ్ చేస్తున్న ముఠా గట్టురట్టు చేసిన ఘటన బోడుప్పల్ పరిధిలోని రెడ్డి కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది.మల్కాజ్ గిరి ఎస్.వో.టీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి కాలనీలోని ఓ బిల్డింగ్ రెండో అంతస్తులో గుట్టుచప్పుడు కాకుండా చిన్నపిల్లలకు సంబంధించి కాలం చెల్లిన తినుబండరాలు, కాస్మోటిక్ ఐటమ్స్ కి గడువు తేదీలు పొడిగించి స్టిక్కరింగ్ చేస్తున్నా ముఠాపై దాడి చేసి ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేశారు.
అదేవిధంగా వారి నుంచి సుమారు రూ.6.5లక్షల విలువ చేసే చిన్న పిల్లల తిను బండారాలు, కాస్మొటిక్, ఇతర ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.వో.టీ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని కోటి, ఇతర ప్రాంతాల నుంచి కాలం చెల్లిన వాటిని తీసుకొచ్చి ఎక్స్పైరీ డేట్ ను మార్చి స్ట్రిక్కెరింగ్ వేసి, ఇతర ప్రాంతాల్లో ఆ వస్తువులను ముఠా ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను ఎస్.వో.టీ పోలీసులు మేడిపల్లి పోలీసులకు అప్పజెప్పారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.