ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉప్పల్ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన రూ. 2 కోట్ల 52 లక్షల చెక్కులను శనివారం ఎమ్మెల్యే బీఎల్ఆర్ పంపిణీ చేశారు.

Update: 2024-08-31 13:18 GMT

దిశ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన రూ. 2 కోట్ల 52 లక్షల చెక్కులను శనివారం ఎమ్మెల్యే బీఎల్ఆర్ పంపిణీ చేశారు. కాప్రా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ లో కాప్రా మండల తహసీల్దార్ సుచరిత అధ్యక్షతన జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెదింటి ఆడపిల్ల వివాహానికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎంతగానో మేలు చేకూరుతుందన్నారు. అలాగే చెక్కుల విషయంలో అలస్యం కాకుండా తొందరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News