ఫ్లై వుడ్ షాప్ లో షార్ట్ సర్క్యూట్..

గాజులరామారం మహాదేవపురంలో గల ఓ ఫ్లై వుడ్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-09-09 15:40 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : గాజులరామారం మహాదేవపురంలో గల ఓ ఫ్లై వుడ్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి అందులో గల విలువైన ఫ్లై వుడ్, హార్డ్ వేర్ సామాగ్రి అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. షార్ట్ సర్క్యూట్ కు గల కారణాలను షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీక్రిష్ణ, జగదీశ్వర్ రెడ్డి, భాస్కర్, గణపతి స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Similar News