సమన్విత రెడ్డికి ఒకేసారి పది ప్రపంచ రికార్డులు

రివర్స్ స్కేటింగ్ చేస్తూ కూచిపూడి నాట్యం ప్రదర్శించడంతో సమన్విత రెడ్డి కి ప్రపంచ రికార్డులలో స్థానం లభించింది.

Update: 2024-11-06 15:45 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : రివర్స్ స్కేటింగ్ చేస్తూ కూచిపూడి నాట్యం ప్రదర్శించడంతో సమన్విత రెడ్డి కి ప్రపంచ రికార్డులలో స్థానం లభించింది. ఈ నమోదు పత్రాలను బుధవారం ఆమెకు అందజేశారు. పేట్ బషీరాబాద్ లో నృత్యకేళి వ్యవస్థాపకులు డాక్టర్ నామని రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10 ప్రపంచ రికార్డుల నమోదు పత్రాలను భారత్ వరల్డ్ రికార్డ్ ఫౌండర్ లయన్ కేవీ రమణారావు, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సీఈఓ డాక్టర్ సచ్చేవోలు రాంబాబు, పియర్సన్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అస్మా షాహీదా సమక్షంలో అందజేశారు.

    భారత్ వరల్డ్ రికార్డ్స్ , అమేజింగ్ కిడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ,తెలుగు వరల్డ్ రికార్డ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికార్డు హోల్డర్స్ బుక్, చిల్డ్రన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, జీనియస్ గ్లోబల్ రికార్డ్స్, ఫ్యూచర్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డు, వండర్ ఇండియా ( భారత్) రికార్డు, హై రేంజ్ వరల్డ్ రికార్డ్ లలో సమన్విత రెడ్డి స్థానం పొందిందని నిర్వాహకులు పేర్కొన్నారు. 


Similar News