భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

స్థానికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు.

Update: 2023-03-31 13:33 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : స్థానికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. 35వ రోజు జరిగిన ప్రగతి యాత్రలో భాగంగా రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్, వెంకట్ రామ్ రెడ్డి నగర్ లలో కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. యాత్రలో భాగంగా ఆయా బస్తీలు కాలనీలలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి జరగబోయే అభివృద్ధి పనుల విషయమై అధికారులతో మాట్లాడారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులను పక్కా ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు..

నందానగర్ లో రూ.2.90 కోట్లతో సీసీ రోడ్లు, ఎస్సీ స్మశానవాటిక, బస్తీ దవాఖాన వంటి అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు, అదేవిధంగా గాంధీనగర్ లో రూ.2.90 కోట్లతో భూగర్భడ్రైనేజీ, దాదాపు సీసీ రోడ్లు పూర్తి చేసినందుకు, వెంకట్ రామ్ రెడ్డి నగర్ లో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి అభివృద్ధి పనులు పూర్తి అయినందుకు సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానికులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నందానగర్ ప్రెసిడెంట్ కార్తిక్ గౌడ్, నర్సింగ్ రావు, హరిబాబు, చిన్ననర్సింగ్ రావు, రాజేష్, వీరీశ్, దాసు, బాబుమియ, సుజాత, దుర్గమ్మ, సులోచన, చిత్ర, సుకన్య, శాంత కుమారి, గాంధీ నగర్ అధ్యక్షుడు జల్దా రాఘవులు, చింతయ్య, జల్దా లక్ష్మీనాథ్, అబ్దుల్ ఖాదర్, ఎల్లయ్య, నీలగిరి, వాజిద్, శ్రీనివాస్, సత్యనారాయణ, బిర్జు సింగ్, చిన్నయ్య,, రాజిరెడ్డి, వెంకట్ సాయి, పద్మ, మని, వెంకట్ రామ్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ సతీష్ గట్టోజి, రషీద్, లక్ష్మణ్ గౌడ్, మోహన్ రెడ్డి, మల్లేష్ చారి, అశోక్, రామకృష్ణ ముదిరాజ్, బసప్ప, రాజిరెడ్డి, మహదేవ్, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News