CI Srinath : ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి

పండుగల సందర్భంగా ఊళ్లకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శామీర్ పేట సీఐ శ్రీనాథ్ సూచించారు.

Update: 2024-10-03 11:19 GMT

దిశ, శామీర్ పేట: పండుగల సందర్భంగా ఊళ్లకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శామీర్ పేట సీఐ శ్రీనాథ్ సూచించారు. బుధవారం అయిన మాట్లాడుతూ… పండుగ సమయంలో ఊళ్లకు వెళ్లాల్సి వస్తే బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని లేనిచో, ఇంట్లోనే రహస్య ప్రదేశాల్లో ఉంచుకోవాలని అన్నారు. తాళం వేసి ఊరు వెళ్లాల్సి వస్తే పోలీస్ స్టేషన్ లో తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలో కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బైక్ తాళాలు వేసి ఇంటి ఆవరణంలోనే పార్క్ చేయాలన్నారు. నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 100,లేదా శామీర్ పేట పోలీస్ స్టేషన్ 9490617142, 9490617231 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


Similar News