ప్రత్యేక పాలనలో దోమల నివారణపై అలసత్వం..!

మండలంతో పాటు మూడు చింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

Update: 2024-07-14 02:58 GMT

దిశ, శామీర్‌పేట: మండలంతో పాటు మూడు చింతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రత్యేక పాలనలో నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు దృష్టి సారించడం లేదు. అసలే వర్షాకాలం అపరిశుభ్రత ఆపై చీకటి పడితే చాలు ఏ వార్డుకి వెళ్ళిన దోమల మోత వినిపిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ప్రధాన రోడ్డుతో పాటు వార్డు అంతర్గత రోడ్లులో వర్షం నీరు చేరడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి.

ప్రత్యేక పాలనలో అలసత్వం..

వర్షాకాలం వచ్చిందంటే సర్పంచులు గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ చల్లించేవారు కానీ ప్రత్యేక పాలనలో అది కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వార్డులో రోడ్డు పక్కనే చెత్త వేయ డంతో వాటిలో దోమలు తిష్ట వేస్తున్నాయని ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద చెత్తా చెదారం వేయడంతో మురికి కుంప మారుతున్నాయి. ఏటా వర్షాకాలం లో ఫాగింగ్ యంత్రాలతో దోమల నివారణకు చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం అది కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు.

మూలన యంత్రాలు..

పలు పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలు ఉన్నా ప్రత్యేక పాలనలో వాటిని ముట్టుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీల్లో నిధుల లేమితో పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా పరిశుభ్రతపై దృష్టి సారించకుంటే దోమలు వ్యాప్తి చెంది రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News