దుండిగల్ పోలీస్ స్టేషన్ కు జాతీయ అవార్డు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

Update: 2023-02-20 17:10 GMT

దిశ, దుండిగల్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రతి ఏటా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అందజేసే ఉత్తమ సేవా పోలీస్ స్టేషన్ అవార్డు 2022 గాను రాష్ట్రంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ దక్కింది. ఈ అవార్డును మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు అందజేయగా సోమవారం తెలంగాణ డీజీపీ అంజినీ కుమార్ చేతుల మీదుగా డీసీసీ సందీప్ గొనె, సీఐ రమణారెడ్డి అందుకున్నారు.

సేవకు గుర్తింపు...

2022 ఆగస్టులో దుండిగల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారులు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడతో పాటు సిబ్బంది పనితీరు, రికార్డు సెక్షన్ పనితీరు, కేసుల విచారణ వాటి పరిస్కారం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. కేసుల పరిస్కారం, రికార్డు సెక్షన్ పనితీరు, పరిసరాల పరిశుభ్రత ఆధారంగా అవార్డు ను ఎంపిక చేసినట్లు సీఐ రమణా రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుండిగల్ పోలీస్ స్టేషన్ పనితీరు ఆధారంగా దేశ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. సేవలు మరింత మెరుగు పరుస్తూ ముందుకెళ్లేందుకు బాధ్యత పెరిగిందన్నారు. డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించినట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News