దేశాభివృద్ధిలో అంబేద్కర్ సేవలు అమోఘం.. మంత్రి మల్లారెడ్డి
అంబేద్కర్ రాజ్యాంగ రచనతోనే అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్: అంబేద్కర్ రాజ్యాంగ రచనతోనే అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ సేవలు అమోఘమని కొనియడారు. ఆదివారం ఘట్ కేసర్ లో ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిర్వహించిన 100వ రోజు పుష్పాంజలి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మల్లారెడ్డి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వేచ్ఛ, స్వాతంత్రంతో హాయిగా జీవించుటకు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు భారత్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. టీఎస్ ఎంఎస్ ఐడీసీ డాక్టర్ ఏర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని భారత్ కు అందించిన ఘనత అంబేద్కర్ కు దక్కిందని కొనియాడారు. కార్యక్రమంలో టీఎస్ఎస్ జీడీసీఎఫ్ ఛైర్మన్ దుడి మెట్ల బాలరాజు యాదవ్, జెడ్పీ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఘట్ కేసర్,పోచారం మున్సిపల్ ఛైర్మన్లు ముల్లి పావని జంగయ్య యాదవ్, బోయిన్ పల్లి కొండల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పలుగుల మాధవరెడ్డి, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.