ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి : నర్సింహారెడ్డి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా పనిచేయాలని... Meeting with officials Over MLC Elections

Update: 2023-03-09 09:59 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా పనిచేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. ఈ నెల 13వ తేదీన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ కాన్పరెన్స్ హాలులో మేడ్చల్ జిల్లాకు చెందిన మైక్రోఅబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఓపీవోలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, జెడ్పీ సీఈఓ దేవ సహాయంలతో కలిసి అదనపు కలెక్టర్, ఏఆర్వో నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులపై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కూడా అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా కారణాలతో ప్రిసైడింగ్ అధికారి ఎన్నికలు నిర్వహించలేనట్లయితే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి కూడా ఎన్నికలు నిర్వహించే విధంగా సంసిద్ధంగా ఉండాలని నర్సింహారెడ్డి సూచించారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో 14 పోలింగ్ స్టేషన్లకుగాను 8 పోలింగ్ కేంద్రాలు కీసర డివిజన్ లో, మరో 6 పోలింగ్ కేంద్రాలు మల్కాజిగిరి డివిజన్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,536 మంది ఓటర్లు ఉన్నారని, అందులో పురుషులు 3,038, మహిళా ఓటర్లు 3,498 మంది ఉన్నట్లు వివరించారు.

Tags:    

Similar News