టెన్త్ ఫలితాల్లో జిల్లా టాప్‌లో ఉండాలి : విజయకుమారి

టెన్త్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాను టాప్ లో నిలపాలని జిల్లా వైద్యాధికారి విజయకుమారి అన్నారు. పదవతరగతి పరీక్షల... Meeting with officials

Update: 2023-03-09 10:19 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: టెన్త్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాను టాప్ లో నిలపాలని జిల్లా వైద్యాధికారి విజయకుమారి అన్నారు. పదవతరగతి పరీక్షల సన్నద్దతపై గురువారం కూకట్ పల్లిలోని పీఎస్ఎం పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పదవతరగతి పరీక్షల సన్నద్దతపై నిర్వహించనున్న రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని డీఈఓ విజయకుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంరద్భంగా ఆమె మాట్లాడుతూ.... పదో తరగతి ప్రీ ఫైనల్ –1 రిజల్ట్ పాఠశాలల వారీగా ఒక్కో ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. ఆయా పాఠశాలల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సీ – గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు నియమించి రాబోయే ముప్పై రోజులపాటు ప్రత్యేక కోచింగ్ ఇప్పించాలని కోరారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చే విధంగా ప్రతి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గణితం భౌతికశాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయుల ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేకంగా చేపడుతున్న తొలిమెట్టు, మన ఊరు– మన బడి, బడి బయట పిల్లల సర్వే పలు అంశాలపై కూడా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ సెక్రటరీ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News