Medak MLA : బేషరతుగా కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలి

దూలపల్లిలో గురువారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

Update: 2024-09-19 14:43 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: దూలపల్లిలో గురువారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీడియా సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రణవీత్ సింగ్ బిట్టు, మాజీ ఎమ్మెల్యే తార్విందర్ సింగ్ మార్వా లను బీజేపీ పార్టీ నుంచి కేంద్ర పదవి నుంచి తక్షణమే బర్తరఫ్  కు చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో గొంతుకగా నిలిచిన రాహుల్ గాంధీ ని రెండు దశాబ్దాలుగా ప్రజలు ఎన్నుకొని పార్లమెంటుకి పంపిస్తున్నారని, అలాంటి నాయకుడిని బీజేపీ కేంద్ర మంత్రి రాహుల్ గాంధీని భారతీయుడు కాదంటున్నారని ఒక టెర్రరిస్ట్ గా పేర్కొనడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని బీజేపీ పార్టీ తక్షణమే సస్పెండ్ చేయాలని, కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబం అని, అలాంటి వారిపై నోరు పారేసుకుంటున్న వారికి బుద్ధి చెప్పే సత్తా కాంగ్రెస్ శ్రేణులకు ఉన్నప్పటికీ “నఫ్రత్ చౌడో భారత్ జోడో” అనే నినాదంతో ముందుకెళ్తున్న రాహుల్ గాంధీ మాటలకు గౌరవం ఇస్తూ ఆ పని చేయడం లేదని పేర్కొన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దానికి తగిన పరిణామాలు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.


Similar News