మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా : ఈటల
మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ
దిశ, కుత్బుల్లాపూర్ : మల్కాజిగిరి పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ ఒకటో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు దంపతులు, వందలాది మంది కార్యకర్తలతో సోమవారం బీజేపీ మల్కాజిగిరి పార్లమెంటరీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు.బాచుపల్లి కేఆర్సీఆర్ కాలనీ నందు భారీ సభలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై నమ్మకం తో ఈరోజు జాయిన్ అయిన కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావుకు ఇచ్చిన మాటకి కట్టుబడి రాజకీయ భవిష్యత్ కి హామీ ఇస్తున్నామని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిందని, అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శలు చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి బాటలో నడిపించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దగా చేసిందని అన్నారు.అదేవిదంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చి గద్దెనెక్కి 66 హామీలు ఇచ్చి అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేక ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. బీఆర్ ఎస్, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పేలా ప్రజలందరూ మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును బహుమతిగా ఇవ్వాలని కోరారు. మల్కాజ్గిరి 70% అర్బన్ ప్రాంతం కాబట్టి మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు ఎక్కువ మొత్తంలో తెచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఆర్థిక, వాణిజ్య, సైనిక శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే అగ్రదేశాల సరసన నిలపడం మోడీ ప్రభుత్వ ఘనతగా ఆయన అభివర్ణించారు. ఐదో ఆర్థిక వ్యవస్థ దేశంగా ,ప్రపంచ దేశాలకి కరోనా టీకాలను అందించిన దేశంగా, ప్రపంచ దేశాలు భారత దేశ దౌత్య సంబంధాల కోసం ఎదురుచూసే విధంగా తయారుచేసిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు.ఆర్టికల్ 370 రద్దు ,రామ మందిర నిర్మాణం, కాశ్మీర్ సమస్య పరిష్కారం, పాకిస్తాన్ చైనాతో బోర్డర్ సమస్య మరియు ఉగ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వం దేశంలో శాంతిభద్రతలు నెలకొల్పిన విధంగానే మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపు మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి గెలుపు ద్వారా సాధ్యం అవుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ను గెలిపిస్తే ప్రజల మెచ్చే నాయకుడిగా పనులు చేస్తానని, నీతి నిజాయితీతో పని చేయడమే కాదు మా మల్కాజిగిరి ఎంపీ అని కాలర్ ఎగరే చెప్పుకునే విధంగా ఉంటానని, మల్కాజిగిరి అభివృద్ధికి మనసా, వాచా కర్మణా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భరత్ సింహారెడ్డి, కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ మాధవరం కాంతారావు, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి దాసి నాగరాజు, పార్లమెంట్ కో కన్వీనర్ డాక్టర్ రాజు, నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్, దుండిగల్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఆంజనేయులు, జిల్లా నాయకులు కృష్ణారెడ్డి, సుమన్ రావు, కళ్యాణ్ చక్రవర్తి, నిజాంపేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ, నరేంద్ర చౌదరి, బిక్షపతి యాదవ్, బిజెపి నాయకులు&వివిధ కాలనీల అధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.