అభివృద్ధికి చిరునామాగా కుత్బుల్లాపూర్ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
అభివృద్ధికి చిరునామాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు.
దిశ, కుత్భుల్లాపూర్: అభివృద్ధికి చిరునామాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో "ప్రగతి యాత్ర"లో భాగంగా 70వ రోజు ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా రూ.3.73 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదటగా రూ. 40 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు, రూ. 37 లక్షలతో పార్క్ అభివృద్ధి, రూ. 27 లక్షలతో మజీద్ పార్క్ అభివృద్ధి, రూ. 65 లక్షలతో బతుకమ్మ ఘాట్ వద్ద జంక్షన్ వెడల్పు అభివృద్ధి, ఆర్సీసీ పైప్ బాక్స్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణ రావు, స్థానిక కార్పొరేటర్ చల్లా ఇంద్రజిత్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం రూ. 1.28 కోట్లతో పూర్తి చేసిన సీసీ రోడ్డు, రూ.65 లక్షలతో భూగర్భ డ్రైనేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధికి చిరునామాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.