Kukatpally MLA : రంగధాముని చెరువు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి

రంగధాముని చెరువు అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేసే

Update: 2024-10-30 16:43 GMT

దిశ, కూకట్​పల్లి: రంగధాముని చెరువు అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం అధికారులతో కలిసి రంగధాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ చెరువు అభివృద్ధి పనులలో భూములు కోల్పోయిన రైతులను పిలిచి వారికి తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా గత కొంత కాలంగా తమ భూములలో పైప్​లైన్​ పనులు, ఫెన్సింగ్, వాకింగ్​ ట్రాక్​ పనులు చేపడుతుండటంతో పట్టా దారులు భయపడుతున్నారని, భూ యజమానులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నష్టపరిహారం కింద భూములు కోల్పోతున్న వారికి టీడీఆర్​ఎస్​ ఇస్తుందని, అది ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.

సుమారు రూ. 19 కోట్ల  వ్యయంతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కొంత వరకు పనులు పూర్తి కాగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రంగధాముని చెరువు అభివృద్ధి పనులు పూర్తి అయితే చెరువు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసుకునేందుకు వీలుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్​ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్​ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News