వినూత్న రీతిలో కెహెచ్ఆర్ ఎన్నికల ప్రచారం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నారు.

Update: 2023-11-11 17:18 GMT

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని విద్యావంతులు ఎక్కువగా నివాసం వుండే గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లో మార్నింగ్ వాక్ లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. శనివారం నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ బాచూపల్లి పరిధిలోని లేక్ వ్యూ విల్లాలు, బాచూపల్లి ప్రణీత ఏంటిలియ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యావంతుల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చర్చి గాగిల్లపూర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వై.శ్రీకర్ రెడ్డి ప్రదీప్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, కె.వినోద్ రెడ్డి, వై.థామస్ రెడ్డి, వై.ప్లీవ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి తోపాటు సుమారు 500 మంది కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో దుండిగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే చెప్పవచ్చు.

Tags:    

Similar News