దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్: శంభీపూర్ రాజు
దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు అన్నారు.
దిశ, దుందిగల్ : దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట లో బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో స్థానిక శాసన సభ్యులు వివేకానందతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల చేత దగాపడ్డ తెలంగాణలో స్వరాష్ట్ర సాధనతో దండగన్న వ్యవసాయాన్ని పండగచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.
రైతు సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, ఇందుకోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తున్నట్లు గుర్తుచేశారు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత దేశంలో తెలంగాణా రాష్ట్రానిదే అన్నారు. అంతకు ముందు మండల వ్యవసాయ అధికారి మాధవ రెడ్డి 9 ఏండ్లలో జరిగిన తెలంగాణ వ్యవసాయ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం 5 మంది ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రాజు, వైస్ చైర్మన్లు నల్తూరి కృష్ణ,రవీందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.