కేసీఆర్ సాగు, తాగు నీటి గోసలు తీర్చిండు: మంత్రి మల్లారెడ్డి

తాగు, సాగు నీరు గోసలు తీర్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

Update: 2023-06-08 01:25 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: తాగు, సాగు నీరు గోసలు తీర్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే నీటి కష్టాలు తీరాయని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నీటి పారుదల శాఖ అధ్వర్యంలో బుధవారం కీసర మండలం,చీర్యాల గ్రామ చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు. అనంతరం ఎంఎల్ఎన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నాడు నీటి కోసం అనేక గోసలు పడ్డాం...పంటలకు నీరు లేక ఒక్క పంట పండించడానికి రైతు అల్లాడి పోయేవారని, సీఎం కేసీఆర్ చెరువుల పునరుద్దరణ జరిపి అన్ని కాలాలలో నీళ్లు సమృద్ధిగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.

మిషన్ కాకతీయ చెరువులను బాగు పర్చాలరని, మిషన్ భగీరత తో ఇంటింటికి నీళ్లను అందించారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం మత్స కారులకు చేప పిల్లలలను అందిస్తూ,చెరువు మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీలు ఇందిరా, ఎల్లుబాయ్,మత్స్య శాఖ జిల్లా అధికారి పూర్ణిమా చీర్యాల సర్పంచ్ తుంగ ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News