కైత్లాపూర్​ టూ హైటెక్​సిటి రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే

కైత్లాపూర్​ నుంచి హైటెక్​ సిటి వెళ్లే రోడ్డును వంద ఫీట్లుగా విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-28 16:51 GMT

దిశ, కూకట్​పల్లి : కైత్లాపూర్​ నుంచి హైటెక్​ సిటి వెళ్లే రోడ్డును వంద ఫీట్లుగా విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్​ఎంసీ, ట్రాఫిక్​ పోలీస్​ అధికారులతో కైత్లాపూర్​ నుంచి హైటెక్​ సిటీ వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్​పల్లిలో ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించేందుకు కైత్లాపూర్​ నుంచి హైటెక్​ సిటీ వైపు వెళ్లే దారిని వంద ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేసేందుకు బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో పది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో పాటు రోడ్డు కొరకు మఠం వారిని ఒప్పించి భూమిని సైతం జీహెచ్​ఎంసీకి విరాళంగా అందించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

వంద ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేస్తే ట్రాఫిక్​ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రోడ్డు విస్తరణ పనులు ఐడీఎల్​ అధికారులు అడ్డుకుంటున్నారని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించి అధికారులు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​లు సబీహ బేగం, మాజీ కార్పొరేటర్​ బాబురావు, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దిన్​ తదితరులు పాల్గొన్నారు.


Similar News