జన ఔషధి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు.

Update: 2024-08-11 14:36 GMT

దిశ, మల్కాజిగిరి : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఆదివారం నేరేడ్మెట్ డివిజన్ సైనిక్ విహార్ లో మాజీ సైనికులు, బీజేపీ సీనియర్ నాయకులు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు. దేశంలో 12,400 పైగా కేంద్రాలు ఉన్నయని ఈ కేంద్రాలలో అతి తక్కువ ధరలకే నాణ్యత కలిగిన మందులు కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్నాయన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ సైనికుల విభాగం కన్వీనర్ గోపురమణా రెడ్డి మాట్లాడుతూ

    27వ జన ఔషధి కేంద్రం మధుర నగర్ కాలనీలో ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందన్నారు. మాజీ సైనికుడిగా సమాజానికి సేవా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్ర రావు , మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్, వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి , మాజీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి , నేరేడ్మెట్ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ బాబు, వినాయక నగర్ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ , డివిజన్ నాయకులు సాయి సురేష్, సైనిక్ విహార్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News