మల్లారెడ్డికి ఓటు వెయ్యాలని హుకుం జారీ చేసిన మేయర్
బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సెలబ్రిటీ రిసార్ట్ లో నిర్వహించిన కుర్మసంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
దిశ, శామీర్ పేట : బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సెలబ్రిటీ రిసార్ట్ లో నిర్వహించిన కుర్మసంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలో సెలబ్రిటీ రిసార్ట్ లో కుర్మసంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని సుమారు 2000 మందితో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుర్మ కులస్తులు మంత్రి మల్లారెడ్డి మద్దతు తెలపాలని హుకుం జారీ చేయగా కుర్మ కులస్తులు కొందరు ఆ మాటకు కుర్చీల నుండి లేచి తిరగబడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఒకరి పైకి ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఈ దాడి దృశ్యాలు అక్కడే ఉన్న ఓ శామీర్ పేట మండల విలేకరి చిత్రీకరిస్తుండగా అతని ఫోన్ ను లాక్కొని అతన్ని కింద పడేసి దాడి చేశారు.
కింద పడిపోయిన విలేకరి దాడి చేస్తున్న వారితో నేను విలేకరినని వారితో చెప్పగా కుర్మ కులస్తులలోని ఇద్దరు వ్యక్తులు అయితే ఏంటి విలేకరులు అయితే ఏమైనా పీకుతారా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఉద్రేకంతో రెచ్చిపోతు అధికార ఆహంకారంతో దుర్భషాలడారూ. విలేకరిపై దాడి చేసింది ఎవరని ఆరా తీయగా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య అనుచరుడు కాశీ, సోదరుడు భార్గవ్ అని తేలింది. ఈ తతంగం మొత్తం జవహర్ నగర్ మేయర్ కావ్య తండ్రి అయ్యప్ప, సోదరుడు భార్గవ్ ఆధ్వర్యంలో జరిగింది. వెంటనే శామీర్ పేట మండలంలో పనిచేస్తున్న విలేకరులు అందరూ కలిసి శామీర్ పేట పోలీస్ స్టేషన్లో దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి పై వెంటనే చర్యలు చేపట్టకపోతే జిల్లాలోని విలేకరులందరు పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు, ఉమ్మడి శామీర్ పేట ప్రింట్ మీడియా అధ్యక్షుడు గంజి రమేష్ హెచ్చరించారు.