Mynampally Hanumanth Rao : మల్కాజిగిరిలో మైనంపల్లి పంతం నెగ్గేనా..

ఎన్నికల కోడ్ అమలోకి రావడంతో రాజకీయ పార్టీలు దూకుడు

Update: 2023-10-12 12:42 GMT

దిశ,అల్వాల్ :  ఎన్నికల కోడ్ అమలోకి రావడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి.ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం అయితే రాష్ట్ర ప్రజలందరికి హార్ట్ టాపిక్ గా మారింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు డాక్టర్ రోహిత్ కు మెదక్ టికెట్ విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తిరుమలలో అనుచిత వాఖ్యలు చేశాడు. దీంతో అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.కేటీఆర్, కవిత హరీష్ రావుకు అండా ఉంటామని చెప్పడంతో మైనంపల్లి మ్యాటర్ మరింత సీరియస్ అయింది. ఒకటి రెండు రోజుల్లో అధిష్టానం వేటుకు సిద్ధం అవుతున్న తరుణంలో తానే బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానీ ప్రకటించి చేశాడు.అనంతరం అనేక తర్జన భర్జనలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ మల్కాజిగిరి టికెట్లు తెచ్చుకున్నారు.రెండు టికెట్ల విషయంలో అధికార యుతంగా ప్రకటన అయితే రాలేదు కానీ టికెట్లు ఖరారు అయినట్లేనని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.

మెదక్, మల్కాజిగిరిలో తండ్రి కొడుకులు విజయం సాధ్యమా ?

మైనంపల్లి హన్మంతరావు అంటేనే రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిష్మ గల నాయకుడిగా గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఆయనకు తగిన విధంగా పదవులను ఇచ్చి ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంది. ఎమ్మెల్యేగా మల్కాజిగిరిలో అభి`ద్ది పనులను వేగవంతం చేశాడు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఆయనకు ఉన్న పలుకుబడి పరపతితో అధిక మొత్తంలో నిధులు సమకూర్చి అభివద్ది పనులను ఒక దారికి తెచ్చాడు. ఆర్ యూబి అండర్ బిడ్జీల విషయం కానీ మౌలాళీ కమాన్ వద్ద ఎర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడం అది మైనంపల్లికే సాధ్యం అయింది వేరే వారితో కాకపోయేది అని ఆ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు. అంతటి ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు మైనంపల్లి గెలుపు విషయంలో మాత్రం నువ్వానేనా అనేవిధంగా మారనున్నాయని పరిశీలకులు అంటున్నారు.ఇ పరిస్థితి పార్టీ మారినందుకా? బీఆర్ఎస్ అదిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి అష్ట దిగ్బంధం చేయనున్నందుకా అనేది అర్థం కావడం లేదంటున్నారు.

ఇప్పటికే ఆయన ఆశీర్వాదంతో పదవులు, పోస్టింగ్ లు సంపాధించిన అధికారులందరిని ప్రభుత్వం గుర్తించి ట్రాన్స్ ఫర్ చేశారు. అష్టదిగ్బందనం ప్రారంభం అయినట్లేనని అంటున్నారు. సునాయసంగా గెలిచే సీటును తన కుమారుడి కోసం కఠిన తరం చేసుకొన్ని తండ్రిగా మైనంపల్లి మల్కాజిగిరి నియోజకవర్గం ఎన్నికల చరిత్రలో నిలిచిపోతారు అంటున్నారు. ఎన్ని ఎత్తులు జిత్తు లేసిన ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలు జరిగే నాటికి ఏమోకానీ మైనంపల్లి చరిష్మా మల్కాజిగిరిలో మసకబారిన పరిస్థితే కనిపిస్తుందిని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News