ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం : డీఐసీజీఎం ప్రశాంత్

రుణ రాయితీతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.ప్రశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2024-09-23 17:24 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : రుణ రాయితీతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.ప్రశాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా 35 శాతం వరకు తీసుకున్న రుణంలో రాయితీ కల్పిస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ, పీఎంఎఫ్ఎంఈల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారని అన్నారు. తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు రాయితీ ఉంటుందని, గతంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందని వారు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని, లబ్ధిదారులు 10 శాతం వాటా కనీసం ఉండాలని అన్నారు. ఆసక్తి కలవారు జిల్లా ఆహార శుద్ధి పరిశ్రమల డీఆర్పీ అమర్ సింగ్ ఫోన్ 94934 38347 లో సంప్రదించవచ్చని సూచించారు.


Similar News