MLA: ప్రజలకు ఇబ్బంది కలగకుండా మౌలిక వసతులు కల్పించాలి
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని, డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. తాగునీటి పైప్లైన్ సరిగా లేక తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు. అధికారులు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఈఈ గోవర్ధన్, మూసాపేట్ ఈఈ శ్రీనివాస్, డిఈఈలు శ్రీదేవి, శంకర్, జలమండలి జీఎం ప్రభాకర్, డీజీఎం నాగప్రియ, మాజీ కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.