మల్కాజిగిరి సర్కిల్ లో అక్రమ నిర్మాణాల జోరు...

మల్కాజిగిరి సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. మల్కాజిగిరి, మౌలాలీ, గౌతంనగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్,

Update: 2024-10-08 11:11 GMT

దిశ, మల్కాజిగిరి ; మల్కాజిగిరి సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. మల్కాజిగిరి, మౌలాలీ, గౌతంనగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్, నేరేడ్మెట్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. సెల్లార్ నిర్మాణాలతో పాటు ఆదనపు అంతస్థుల నిర్మాణాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు మెండుగా ఉండటంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపులేకుండా పోతుందని కాలనీవాసులు వాపోతున్నారు. సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్ లలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని నోటీసులు జారీ చేశామంటూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.

నిబంధనలను ఉల్లఘించి బారీ షెడ్లు, సెల్లార్లు, బహుళ అంతస్తులు, పెంట్ హౌస్ ల నిర్మాణాలు లెక్కలేనన్ని చేపడుతున్న అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కలగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణాలకు ఎలాంటి పొంతన లేకుండా పోతుందని వాపోతున్నారు. నేరేడ్ మెట్ , యాప్రాల్ ప్రధాన రహదారి పక్కనే నిబంధలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎవరెవరికి అందాల్సిన ముడుపులు వారికి చెందుతుంటే అక్రమ నిర్మాణాల గురించి అధికారులు ఎందుకు పట్టించుకుంటారంటూ స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు మల్కాజిగిరి సర్కిల్ లో వెలుస్తున్న అక్రమ కట్టడాలపై తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News