దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి : ఈటల
దేశం అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని
దిశ,ఘట్కేసర్ : దేశం అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ లో గురుకుల్ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈటల మాట్లాడారు. 'అబ్ కీ బార్ 400 కి పార్' నినాదం తో ప్రచారంలో ముందుకెళుతున్న బీజేపీకి దేశంలో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా తనకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని, అందుకు వాటర్స్ అసోసియేషన్ పూర్తిగా సహకరించాలని కోరారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, ఘట్కేసర్ సహకార బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి లను వారి నివాసంలో ఈటల కలిసి కాసేపు ముచ్చటించిన బీజేపీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఘట్కేసర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఈటెలను కలిసి పూర్తి మద్దతు బీజేపీకి ఉంటుందని తెలియజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రం రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు హనుమాన్ ఈటెల వెంట ఉన్నారు.