హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నా: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Update: 2024-08-26 15:59 GMT

దిశ, కూకట్​పల్లి : చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కానీ నాలుగు దశబ్దాల క్రితం నుంచి నివాసం ఉంటున్న వారికి, ఆలయానికి, స్మశన వాటికకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించరు. చెరువులో ఆక్రమణలు తెలియక ఎన్నో ఏండ్ల క్రితం ఇండ్లను కొనుగోలు చేసి దశాబ్దాలుగా జీవిస్తున్న వారిని ఖాళి చేయించి కూల్చి వేయడం అంటే స్వాగతించే విషయం కాదని చెప్పారు. చెరువు ఆక్రమిత ప్రాంతాలలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను, జీహెచ్​ఎంసీ కమిషనర్​ను ముందు సస్పెండ్​ చేయాలని, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

నాలా ఆక్రమణలను ముందుగా తొలగించాలని కోరారు. ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్​ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. స్థానికంగా ఎన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను సభ్యులుగా చేర్చుకుని విచారించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ఎంతో మంది బ్యాంకుల నుంచి లోన్​లు తీసుకుని కొనుగోలు చేసుకున్న ఇండ్లు ఇప్పుడు చెరువు ఎఫ్​టిఎల్​ అని తేల్చి కూలిస్తే వారి పరిస్థతి ఏంటనేది చెప్పాలన్నారు. 


Similar News