గణేష్, ఈద్ మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి.. డీసీపీ కోటిరెడ్డి

భిన్నత్వంలో ఏకత్వం అయిన మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించి శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి అన్నారు.

Update: 2024-09-11 16:17 GMT

దిశ, అల్వాల్ : భిన్నత్వంలో ఏకత్వం అయిన మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించి శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి అన్నారు. బుధవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ ఆధ్వర్యంలో అల్వాల్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ సంఘాలు ముస్లిం మత పెద్దలతో కలిసి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి పేట్ బషీర్ బాగ్ ఏసీపీ రాములుతో కలిసి కోటి రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఉత్సవం, ఈద్ మిలాద్ ఉన్ నబి ఉత్సవాల సందర్భంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలనీ ప్రజలను కోరారు.

శాంతి కమిటి సభ్యులు అందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అల్వాల్ సర్కిల్ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంలా అన్ని మతాల పండుగలు శాంతియుతంగా వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. సర్వమత సమ్మేళనంతో రెండు పండుగలు జరుపుకుంటూ విధినిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సబ్ ఇన్పెక్టర్లు, సిబ్బంది, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అల్వాల్ సర్కిల్ కన్వీనర్ తూప్రాన్ లక్ష్మణ్, మల్లికార్జున్ గౌడ్,మాచర్ల శ్రీనివాస్,గోపి, శ్రీనివాస్ రావ, ఉదయ్, మహేష్ రాజ్,ఆనంద్, రషీద్ ఖాన్, రహమత్ ఖాన్, ఇషాక్ ఖాన్ లు పాల్గొన్నారు.


Similar News