రాహుల్ రాక కోసం గాంధీ ఐడియాలజీ సెంటర్ ముస్తాబు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాక కోసం బోయిన్ పల్లి లోని
దిశ, కంటోన్మెంట్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాక కోసం బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే ఈనెల 6న ప్రారంభం కానున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన మంగళవారం కాంగ్రెస్ పార్టీ బోయిన్ పల్లి గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో బీసీ ముఖ్య నేతలు,మేధావులతో ఏర్పాటు చేయనున్న సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.ఈ సమావేశంలో కులగణనపై మేధావులు,పౌర హక్కులు,విద్యార్థి,కుల సంఘాల నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో నిర్వహించే కుల గణన సర్వేను ఎలా మెరుగుపరచాలనే అంశంపై మంగళవారం జరిగే సమావేశంలో అందరి సలహాలు,అభిప్రాయాలు,అభ్యంతరాలు తీసుకోనున్నారు.
కాగా ఈ సమావేశానికి సుమారు 5నుండి 6 వందల కాంగ్రెస్ ప్రముఖులు,సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోపాటు కీలక నాయకులు ఈ సమావేశంలో పాల్గొనునున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సమావేశం సజావుగా సాగడానికి పోలీసులు బారి బందోబస్తు,పార్కింగ్ ల కోసం ఏర్పాట్లు చేస్తుండగా రెవెన్యూ,విద్యుత్,కంటోన్ మెంట్ బోర్డు,జిహెచ్ఎంసి,వైధ్య శాఖ అధికారులు సమన్వయ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లపై చర్చించారు.ఈ సందర్భంగా బేగంపేట ఎసిపి గోపాలకృష్ణ బోయిన్పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి లు మాట్లాడుతు ఈ సమావేశానికి సుమారు1000మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని అదేవిధంగా సమావేశానికి అనుమతులు కలిగిన పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి అనుమతించబడతారని,పాస్ లు లేని వారు సమావేశానికి వచ్చి ఇబ్బంది పడకూడదు అని సూచించారు.అదేవిధంగా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలుపకూడదని అలాంటి వివాహనాలపై చర్యలు ఉంటాయని,ముఖ్య ముఖ్యంగా డ్రోన్ కెమెరాలకు ఎలాంటి అనుమతి లేదని వారు తెలిపారు.