విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోన్న ఇన్విజిలేటర్లు.. తొలుత ఫెయిల్‌.. రీవాల్యుయేషన్‌లో 90% మార్కులు!

విద్యా అనేది ప్రది ఒక్కరికి చాలా విలువైనది.

Update: 2024-06-07 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యా అనేది ప్రది ఒక్కరికి చాలా విలువైనది. కాగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించాలని రాత్రింబవళ్లు కష్టపడి.. అలా తాము సంపాదించిన మనీతో పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తుంటారు. అయితే కొంతమంది పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టక పరీక్షల్లో తప్పితే మరికొంతమంది టీచర్ల నిర్లక్ష్యం కారణంగా పరీక్షలో ఫెయిల్ అవుతారు. తాజాగా జవాబు పత్రాలను దిద్దడంలో ఓ టీచర్ నిర్లక్ష్యం కారణంగా పదవ తరగతి విద్యార్థిని ఫెయిల్ అయ్యింది. వివరాల్లోకెళ్తే.. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాంధీ నగర్‌లోని గీతాంజలి స్కూల్‌లో 10వ తరగతి చదివింది. ఇటీవల పదవ తరగతి ఎగ్జామ్స్ రాసింది. తర్వాత వచ్చిన రిజల్ట్స్ లో లతశ్రీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యింది. తాను ఫెయిల్ అయ్యే విద్యార్థిని కాదని.. లతశ్రీ రివాల్యుయేషన్ పెట్టింది. తిరిగి రివాల్యుయేషన్ చేయించగా.. 80 కు 74 మార్కులు వచ్చాయి. కాగా మొత్తంగా 9.3 గ్రేడ్ తో ఉత్తీర్ణత సాధించింది. దీంతో తొలుత పేపర్లు దిద్దిన వారిపై విద్యార్థుల తల్లదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడంతో టీచర్లపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని పలువురు జనాలు మండిపడుతున్నారు.


Similar News