మానవ సంబంధాలకు మతాలతో,కులాలతో,ప్రాంతాలతో సంబంధం లేదు : ఈటల

సోమవారం బోరా ముస్లిం లు ఏర్పాటు చేసిన ఇఫ్తార్

Update: 2024-04-08 16:18 GMT

దిశ,కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: సోమవారం బోరా ముస్లిం లు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా ఈటల పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఈటల మాట్లాడుతూ..నన్ను ఇక్కడికి ఆహ్వానించింసందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మీరు ఉండే జీవన విధానం, కలిసిమెలిసి ఉండే పద్దతి అభినందనీయమన్నారు.ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండలేని ఈ కాలంలో కన్న తల్లికి అన్నం పెట్టని ఈ రోజుల్లో.. ఈ సమాజంలో హైదరాబాద్ లో ఉన్న అన్ని కుటుంబాలు ఉమ్మడి కుటుంబంలో లాగా ఒకే కిచెన్ లో వండుకొని తింటున్నారన్నారన్నారు. హైదరాబాద్ లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగినప్పుడు నరేంద్రమోదీ బోరా సమాజం గురించి చాలా గొప్పగా చెప్పారని, బోరా సమాజం ఈ దేశం పట్ల ఎంత కమిట్మెంట్ తో ఉంటుందో వారిని చూసి నేర్చుకోవాలని చెప్పారు. బోరా సమాజంలో తాను ఒక కుటుంబసభ్యున్ని అని మోదీ చెప్పుకుంటారన్నారు.. ఆ మాటలు వీరి హృదయాలను దోచుకున్నాయి, అందుకే మోదీ గా అంటే వీరికి అంత ప్రేమ, ఆప్యాయత. మానవ సంబంధాలకు మతాలతో, కులాలతో, ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించిన బంధం వీరిది మోదీ ది. మోదీ ని హ్యాట్రిక్ విజయంలో మీరు భాగస్వాములు కావాలని, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి గా నన్ను ఆశీర్వదించాలని ఈటల కోరారు.


Similar News