child laborers : శభాష్ స్మైల్ టీమ్..

మేడ్చల్ జోన్ స్మైల్ టీమ్ సిబ్బందిని రెగ్యులర్ స్మైల్ టీమ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సుజనా అభినందించారు.

Update: 2024-08-01 15:34 GMT

దిశ, దుండిగల్ : మేడ్చల్ జోన్ స్మైల్ టీమ్ సిబ్బందిని రెగ్యులర్ స్మైల్ టీమ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సుజనా అభినందించారు. మేడ్చల్ జోన్ లో బాల కార్మికుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న యజమాలను అదుపులోకి తీసుకొని 96 కేసులు నమోదు చేయడంతో పాటు, 365 రోజులు విధులు నిర్వహిస్తూ వీధి పిల్లలను, రోడ్ల పై ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసే అనాధ పిల్లలను, అపార్ట్మెంట్ దగ్గర పనిచేస్తున్న పిల్లలను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో వారిని రక్షించి బాలరక్షక హోంకు తరలించడం అభినందనీయం అన్నారు. మేడ్చెల్ జోన్ లో 50 కేసులు, పెట్ బషీరాబాద్ డివిజన్ లోని దుండిగల్ తదితర ప్రాంతాల్లో 46 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సైబరాబాద్ కు మాత్రమే పరిమితమైన స్మైల్ టీమ్ ను రాష్ట్రమంతటా విస్తరింపజేయాలన్నారు.

Tags:    

Similar News