క్రమశిక్షణ తోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు.. దుండిగల్ మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి

క్రమశిక్షణతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దుండిగల్ మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ అన్నారు.

Update: 2023-03-13 09:27 GMT

దిశ, దుండిగల్: క్రమశిక్షణ కలిగిన విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాకారం అవుతుందని దుండిగల్ మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 25వ వార్డు శ్రీ సాయి బాలాజీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ప్లే స్కూల్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనం నుండే విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యనందించినపుడే వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాదాస్ వెంకటేష్, మునిసిపల్ వైస్ ప్రెసిడంట్ శామీర్ పేట రంగయ్య, మాజీ వార్డు సభ్యులు బాలా క్రిష్ణ, కాలనీ ప్రెసిడెంట్ జయవీర్,సభ్యులు భుపాల్ రెడ్డి, నాయకులు ప్రవీణ్, ప్రేమ, రేఖ, దీపిక, శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News