కాంగ్రెస్​ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండ : కాంగ్రెస్​ అభ్యర్థి బండి రమేష్​

బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు ఎల్లప్పుడు అండగా ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్​ పార్టీయేనని కాంగ్రెస్​ అభ్యర్థి బండి రమేష్​ అన్నారు.

Update: 2023-11-11 14:27 GMT

దిశ, కూకట్​పల్లి : బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు ఎల్లప్పుడు అండగా ఉండే పార్టీ కేవలం కాంగ్రెస్​ పార్టీయేనని కాంగ్రెస్​ అభ్యర్థి బండి రమేష్​ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్​ డివిజన్​లో శనివారం బండి రమేష్​, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫతేనగర్​ డివిజన్​ పరిధిలోని ప్రభాకర్​ రెడ్డి నగర్​, మస్జిదే రహమానియా ప్రాంతాలలో బండి రమేష్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

డివిజన్​కు చెందిన తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్​ అధ్యక్షుడు మొహ్మద్​ బాఖి, ఆబేద బేగంలో తమ మద్దతు దారులు 150 మందితో కలిసి బండి రమేష్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండి రమేష్​ మాట్లాడుతూ బీఆర్​ఎస్​ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్​ మైనారిటీలకు చేసిందేమి లేదని, రెండు సార్లు ఎన్నికల ముందు 12 శాతం రిజర్వేషన్​ అమలు చేస్తానని చెప్పి మోసం చేసి రెండు సార్లు గద్దెనెక్కన తరువాత మాట తప్పాడని ఆరోపించారు. మైనారిటీల అభ్యున్నతికి ఎటువంటి పథకాలు అమలు చేయలేదని, మైనారిటీలకు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు ఎండి. మోయిజ్​, తూము వేణు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి లకుమా దేవి..

కూకట్​పల్లి నియోజకవర్గం పరిధి అల్లాపూర్​ డివిజన్​ పద్మావతినగర్​ కాలనీలో బండి రమేష్​ సతీమణి బండి లకుమా దేవి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లకుమా దేవి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రానుందని అన్నారు. సోనియా గాంధి ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు.

Tags:    

Similar News