విధ్వంసక బీఆర్ఎస్, బీజేపీలను నమ్మొద్దు..!

విధ్వంసక బీఆర్ఎస్, బీజేపీలను నమ్మొద్దని బీసీ పొలిటికల్ ఫ్రెండ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోంది.

Update: 2023-11-25 14:13 GMT

దిశ, జవహర్ నగర్: విధ్వంసక బీఆర్ఎస్, బీజేపీలను నమ్మొద్దని బీసీ పొలిటికల్ ఫ్రెండ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోంది. ఈ మేరకు శనివారం కార్పొరేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళి మనోహర్ హాజరై మీడియాతో మాట్లాడారు. అనేక సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి చావో రేవో తేలిపోవాలి అన్న పరిస్థితుల్లో సోనియా గాంధీ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారని అన్నారు.

గత పది సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ ను, బీజేపీని ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రకటించిన బీసీ సామాజిక న్యాయం హామీపై హర్షం వ్యక్తం చేస్తూ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రెండ్ జనరల్ సెక్రెటరీ సమ్మయ్య, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే పద్మాచారి, శైలేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News