దిశ ఎఫెక్ట్...కోమటికుంటను పరిశీలించిన హైడ్రా అధికారులు

దేవరయాంజల్ లో కోమటి కుంట చెరువును హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సందర్శించారు.

Update: 2024-11-06 13:41 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : దేవరయాంజల్ లో కోమటి కుంట చెరువును హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సందర్శించారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ లో ‘శిఖం భూములు కబ్జా...కోమటి కుంటను ఆక్రమించి కట్టడాలు’ అనే శీర్షికను దిశ దినపత్రిక బుధవారం కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన హైడ్రా అధికారులు స్థానికంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కబ్జాకు గురైన కోమటి కుంట చెరువును సందర్శించారు.

    చెరువులో వెలిసిన ప్రకృతి రిసార్ట్స్ తోపాటు ఎస్ఆర్ ప్రకృతి ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. అదే విధంగా చెరువును మట్టితో పూడ్చుతున్న దృశ్యాలను, శిఖం స్థలాన్ని ప్రీ కాస్ట్ వాల్స్ తో కబ్జా చేసిన ప్రాంతాలను పరిశీలించి సర్వే నిర్వహించారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, వారి అదేశాల మేరకు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని అధికారులు దిశ ప్రతినిధికి తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రాఘవ, శామీర్ పేట సర్వేయర్ యాదగిరి, మేడ్చల్ సర్వేయర్ వినోద్, మేడ్చల్ ఇరిగేషన్ ఏఈ నిఖిత, హైడ్రా అధికారులు పాల్గొన్నారు. 


Similar News