అనుమతి లేకుండానే మెడికల్ షాపు..సీజ్ చేసిన డీసీఏ అధికారులు
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును డీసీఏ అధికారులు సీజ్ చేసి, ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు
దిశ, జవహర్ నగర్: డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును డీసీఏ అధికారులు సీజ్ చేసి, ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ అధికారి శివ తేజ కథనం ప్రకారం..మల్కారంలో శ్రీ విఘ్నేశ్వర మెడికల్,జనరల్ స్టార్ పేరుతో డీసీఏ అనుమతి లేకుండానే మెడికల్ షాప్‌ను నిర్వహిస్తున్నారన్న సమాచారం గురువారం ఆ మెడికల్ షాప్‌పై దాడి చేసి.. దుకాణంతో పాటు అందులో ఉన్న సుమారు రూ. 50 వేల విలువ చేసే ఔషధాలను సీజ్ చేశామని తెలిపారు.