వివాదాస్పదమైన ఓల్డ్ అల్వాల్ అక్రమ నిర్మాణాం సీజ్

ఎట్టకేలకు అల్వాల్ అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు ఉక్కు పాదం

Update: 2024-08-18 14:06 GMT

దిశ, అల్వాల్: ఎట్టకేలకు అల్వాల్ అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు ఉక్కు పాదం మోపడానికి సిద్దం అవుతున్నారు. అందులో భాగంగానే ఆదివారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని లయోలా ప్రధాన రహదారిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన వ్యాపార సముదాయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. గత వారం రోజుల క్రింద హైడ్రా అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలను పరిశీలించి పోయినట్లు తెలిసింది. దీంతో నిబంధనలు పాటించకుండా కట్టిన నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏది ఏమైన అక్రమ నిర్మాణాలను అరికట్టి ప్రణాళీక బద్దమైన అల్వాల్ పట్టణ అభివృద్ధి జరుగాలనీ పట్టణ వాసులు కోరుతున్నారు.


Similar News