దేశవ్యాప్తంగా బీజేపీ చర్యలు ఎదుర్కోవడమే కాంగ్రెస్ ధ్యేయం

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు జైబాపు జైభీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని డైమండ్ పాయింట్ లో గల గాయత్రీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Update: 2025-03-26 16:07 GMT
దేశవ్యాప్తంగా బీజేపీ చర్యలు ఎదుర్కోవడమే కాంగ్రెస్ ధ్యేయం
  • whatsapp icon

దిశ, తిరుమలగిరి : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు జైబాపు జైభీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని డైమండ్ పాయింట్ లో గల గాయత్రీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని ఎదుర్కోవడానికి ఏఐసీసీ పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1,2,6 వార్డుల్లోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కంటోన్మెంట్ కోఆర్డినేటర్, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, నాయకులు బల్వంత్ రెడ్డి, సదా పాల్గొన్నారు.  

Similar News