కుత్బుల్లాపూర్ లో హస్తానిదే హవా..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హస్తం హవా స్పష్టంగా కనబడుతుంది.

Update: 2023-11-27 17:31 GMT

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హస్తం హవా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తుండడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి గడపగడపకు తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్ధిస్తుండడం, గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల చేతిలో ఒడిపోవడంతో హన్మంత్ రెడ్డికి సానుకూలత వ్యక్తం అవుతుంది.

పార్టీలకు అతీతంగా రెడ్డి సామాజిక వర్గం హన్మంత్ రెడ్డికి జై కొడుతుండడం, సెటిలర్స్, మైనార్టీలు, దళితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారడం, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు పై నడకే అన్నట్లుగా టాక్ వినబడుతుంది. విభేదాలు మరిచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హన్మంత్ రెడ్డికి సహకరిస్తుండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కెఎం.ప్రతాప్, నిజాంపేట మాజీ సర్పంచ్ కోలన్ శ్రీనివాస్ రెడ్డ్ లాంటి వారు బీఆర్ఎస్ ను వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ లో జోష్ ను నింపింది.

రోడ్ షోలో భారీ జనసమీకరణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలో సాగిన రోడ్ షోలో భారీగా జనం పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కొంపల్లి ప్రధాన కూడలి నుండి ప్రారంభమైన రోడ్ షో ఎన్సీఎల్ కాలనీ కొంపల్లి గ్రామం నుండి సాగిన రోడ్ షో మధ్యాన్నం దూలపల్లి ఎన్టీఆర్ చౌరస్తాలో ముగిసింది. అనంతరం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూరపల్లి ఇందిరమ్మ కాలనీలో ప్రారంబమైన రోడ్ షో బహదూరపల్లి గ్రామం, గండిమైసమ్మ చౌరస్తా, దొమ్మరపోచంపల్లి, దుండిగల్, గాగిల్లపూర్, బౌరంపేట మీదుగా సాగి మల్లంపేటలో ముగిసింది.

యువత 500 మందికి పైగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు పరుస్తామన్నారు. హస్తం గుర్తుకు ఓటువేసి కుత్బుల్లాపూర్ లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, జోస్నా శివారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News