కంటోన్మెంట్ సమస్యలను తీర్చీ, అభివృద్ధి చేస్తా: ఈటల రాజేందర్
కంటోన్మెంట్ ప్రాంత సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే దశలవారీగా కంటోన్మెంట్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
దిశ, కంటోన్మెంట్/బోయిన్‌పల్లి: కంటోన్మెంట్ ప్రాంత సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే దశలవారీగా కంటోన్మెంట్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డులోని వాల్మీకి నగర్, సంజీవయ్య వీకర్ సెక్షన్, వాల్మీకి నగర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వంశ తిలక్ తో కలిసి ఆదివారం ఆయన రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయి, దీనికి తోడు తాను ఎంపీగా ఎన్నికైతే వచ్చే నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, దేశం మొత్తం మోదీ వైపు చూస్తున్నారని అన్నారు. రోడ్ షో లో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, సీనియర్ నాయకులు బానిక మల్లికార్జున్, బి ఎన్ శ్రీనివాస్, బానుక నర్మద,అనురాధ, సతీష్,విజయానంద్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.