బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు.. రంగస్థలంగా కుత్బుల్లాపూర్ రాజకీయం

డిబేట్‌ల నుండి దాడుల దాక... మౌనం నుండి అసహనం

Update: 2023-10-26 13:28 GMT

దిశ,కుత్బుల్లాపూర్ : డిబేట్‌ల నుండి దాడుల దాక....మౌనం నుండి అసహనం దాక...కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రాజకీయం రంగస్థలంను తలపిస్తుంది.విమర్శలు, దాడులు, దండయాత్ర ల మాదిరిగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇక్కడి రాజకీయ పోరు జనరంజకంగా మారడం విశ్లేషకులను ఆకట్టుకుంటుంది.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రప్రథమ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఒకరిది,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన హోదా మరొకరిది. కానీ ఇద్దరిదీ ప్రత్యేక మైన పంథా. తండ్రి చాటు రాజకీయ ఓనమాలు పునికి పుచ్చుకున్న వ్యక్తిత్వం ఒకరిది, స్వంతంత్రగా ప్రజల నుంచి ఎదిగి కుత్బుల్లాపూర్ చరిత్ర సృష్టిస్తూ ఇండిపెండెంట్ జెండా ఎగరేసి స్వాభిమానం చాటిన నైజం మరొకరిది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఇద్దరు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బలమైన నేతలుగా గుర్తింపు ఉన్న వారే.ఇద్దరికీ వ్యక్తిగత కక్షలు, తగాదాలు లేనప్పటికీ రాజకీయ పోరు తారా స్థాయిలో తీసుకువెళ్తున్నారు.

కుత్బుల్లాపూర్ లో దాడుల సంస్కృతీ...?

విమర్శలు,సద్విమర్శలుగా మారాలి తప్పితే.... దాడుల వైపు వెళ్లడం అనైతికం. అధికార హోదాలో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్పితే సహనం, శాంతి కోల్పోయి దాడులు చేసుకునే వరకు వెళ్లడం అప్రజాస్వామికం.తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఓ టీవీ ఛానల్ తెచ్చిన తంటా రాజకీయ గుద్దులాటల వరకూ వెళ్లడం కుత్బుల్లాపూర్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.ఏది ఏమైనా అధికారం లో ఉన్న చట్ట సభ సభ్యులకు ఓపిక, సహనం ఎంతో అవసరం.ప్రతి పక్ష నేతలు ఎన్ని విమర్శలు చేసినా ఎంత గోల చేసిన సౌమ్యులు, వివేకావంతులుగా ప్రజలలో చిరకాలం పేరు ప్రతిష్ట నిలుపుకోవాలంటే ఆ మాత్రం సహన శీలత ఓపిక మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. కానీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఆ ఒరవడి కనిపించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడులకు దిగడం, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగడం, దాడులకు తెగబడడం రాజకీయ ప్యాక్షనిజాన్ని తలపించేలా ఉంది.

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరులో మైనస్ ఎవ్వరికీ, మైలేజ్ ఎవ్వరిదీ...?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు, దాడులతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వర్గాల నేతలు షోషల్ మీడియా లో ఒకరిపై మరొకరు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు,ప్రజలు పలువురు కూన ను పరామర్శించి దాడిని ఖండించారు. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సైతం కూన శ్రీశైలం గౌడ్ ను కలిసి పరామర్శించడం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో సరికొత్త రాజకీయ వేదికగా మారనుంది.ఈ అనూహ్య పరిణామంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు లో మైనస్ ఎవ్వరికో... మైలేజ్ ఎవ్వరిదో ఇలాంటి ఘర్షణ ఘటనలు ఎవ్వరికి శాపంగా ఎవ్వరికీ లాభంగా మారనున్నాయో ఓటర్ల నాడి ఎటువైపో కొద్ది రోజుల తర్వాత తేలనుంది.

Tags:    

Similar News