క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్ఎస్: ఎమ్మెల్సీ పల్లా
సైనికుల్లాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కలిగి ఉందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
దిశ, కూకట్పల్లి: సైనికుల్లాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కలిగి ఉందని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఫతేనగర్ తెలంగాణ గార్డెన్స్‌లో మంగళశారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రాజకీయాలలో సమూల మార్పును తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాలలో తన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రైల్వే పుట్ ఓవర్‌బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు, రోడ్డు విస్తరణ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు భూగర్భ డ్రైనేజి, తాగునీటి పైప్‌లైన్, వీధి దీపాలు వంటి సదుపాయాలు ప్రతి కాలనీలో కల్పించేందుకు కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, సబీహ బేగం, ముద్దం నర్సింహా యాదవ్, మందాడి శ్రీనివాస్ రావు, శిరీషా బాబురావు, మాజీ కార్పొరేటర్లు తూం శ్రావణ్ కుమార్, కాండూరి నరేంద్ర చార్యా, బాబురావు తదితరులు పాల్గొన్నారు.