అనుమతి లేనిది లోపలికి ప్రవేశం లేదు.. కొంపల్లి చైర్మన్ కార్యాలయం ముందు బోర్డు
దిశ, కుత్బుల్లాపూర్: ఓట్లు వేసి గెలిపించిన పాలకుడంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో లేకున్నా ఫర్వాలేదు.
దిశ, కుత్బుల్లాపూర్: ఓట్లు వేసి గెలిపించిన పాలకుడంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో లేకున్నా ఫర్వాలేదు.. కనీసం కార్యాలయానికైనా వెళ్లి కలిసి సమస్యను తెలుసుకోవచ్చులే అనుకుంటారు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో ఇందుకు విరుద్ధంగా చైర్మన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా సమస్యను తెలిపేందుకు వస్తే అటెండర్ ఆపుతాడు. తనకు అనుకున్న వారొస్తే వెంటనే లోపలికి రప్పించుకుంటాడు. లేదం టే అక్కడికి వెళ్లిన వారి సంగతి అంతే మరి. గంటల తరబడి ఎదురు చూడాల్సిందే. ఏకంగా అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదని బోర్డునే తగిలించారు. ఎన్నికల సమయంలో పిలువకున్నా ఇంటింటికి వచ్చిఓట్లు అడుగుతారని, ఇప్పుడేమో మొహం చాటేస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.