టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. ఎందుకంటే..?
దిశ, పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ పరిధి షాపుర్ నగర్, ఐడీపీఎల్ ఫుట్ - BJP leaders filed a complaint against Quthbullapur MLA Vivekanand at the police station
దిశ, పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ పరిధి షాపుర్ నగర్, ఐడీపీఎల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై జాతీయ జెండాను అవమానపరిచే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, టీఆర్ఎస్ నేతలపై ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా యాక్ట్-2002 ప్రకారం.. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికార అహంకారం తో జాతీయ జెండాను అవమానించడం అత్యంత దారుణమని, దీనికి కారణమైన ప్రతి ఒక్కరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు గుబ్బల లక్ష్మి నారాయణ, గరిగె శేఖర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
కాగా, ఆదివారం పలు ప్రాంతాలలో జాతీయ జెండా బ్యానర్‌పై ఎమ్మెల్యే ఫోటోతో పాటుగా ఆయన అనుచరుని ఫోటో పెట్టడంపై ఇప్పటికే బీజేపీ శ్రేణులు ట్విట్టర్ వేదికగా డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బొబ్బ ప్రసాద్, శివకుమార్, వల్లూరి ప్రసాద్ గణేష్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.